Tuesday, February 3, 2009

రూపాయి గోడు


నేను రూపాయిని !!! నేను రూపాయిని !!!

నిన్నమొన్నటిదాకా ఎగిరెగిరిపడ్డ రూపాయిని నేను! --2
యిప్పుడే కాలువిరిగిందని తెలిసి దిగులుపడ్డ రూపాయినీ నేనే !!

పేదరికం దరిచేరని రూపాయిని నేను ! --2
ధనికుల అహంబావానికి నలిగిపోతున్న రూపాయినీ నేనే !!

అమాయకుల ఆకలిచావులకు కారకురాలౌతున్న రూపాయిని నేను! --2
ఉన్నవాడి చేతికి బలౌతున్న నష్టజాతక రూపాయినీ నేనే !!

పూటగడవక దిక్కుతోచక వున్నవారికి అందని ద్రాక్షనైన రూపాయిని నేను! --2
నీళ్ళలా ఖర్చుకాబడుతూ సతమతమౌతున్న రూపాయినీ నేనే!!

వినయవిదేయతలున్నవారి మొహంచూడని రూపాయిని నేను! --2
కామక్రోధమదమాత్సల్యాలతో
రగిలిపోతున్న వారి జేబునిండా వున్నరూపాయినీ నేనే !!

లేనివాడి అర్తనాదాలను పట్టించుకోని
ఉన్నవాడి ప్రగల్భాలకు లోనవుతూ
బిక్కమోహంవేసి బక్కచిక్కి
నేలరాలిపోతున్న ప్రాణమున్న నిర్జీవాన్ని!!

దేవుడా! నా ఈ గోడు పట్టించుకోవా!
నీ ఈ జగాన్ని రక్షించుకోవా!!


3 comments:

  1. hmmm.. gud one buddy..

    Samayaanukoolanga raasinattundhi.. Recession is gng on naa :)

    ReplyDelete
  2. Wow this Rupee one is very good buddy. keep posting your thavikas!

    -Vijay

    ReplyDelete