తొలిచూపులోనే ఆహా! అబ్బబ్బబ్బబ్బా!!
ఏమని చెప్పను ఆ ఖజురహో శిల్పం గురించి,
ఏమా సౌందర్యం!!!తివాచిలా విశాలంగా పరచివున్న నుదిటినా
చురకత్తుల్లాంటి నయనాలనాఘాటుగా వాలుజారిన ముక్కునా
తొలకరి జల్లులతో తడిసినట్లున్న అధరాలనా
ఆహా ఏమా ముఖ పరిచయం!
ఎంతటి కారుచీకటినైన చీల్చకుండా ఉంటుందా!!మత్తెక్కించే ఆ అందం
ఆ హొయలు సోయగాలు
ఒంపు సొంపులు
ముట్టుకుంటే కరిగిపోయాలా సుకుమారమైన నడుమునడుస్తూవుంటే నెమలి పించంలా నాట్యమాడుతున్న కేశ సౌందర్యం గురించా
దేహానికే వన్నె తెచ్చిన ఆమె వెనుక అందం!!!
ఆహా
నఖశిఖ పర్యంతం ఓ కళాఖండంలా
యువకుల గుండెల్ని కొల్లగొడుతూ
ఓ అచ్చమైన తెలుగుపిల్లలా
అందమైన బాపు బొమ్మలా
నడిచివస్తున్న దేవకన్యలా ఉన్నది కదా!!!
అజరామరం ఆ అందం!!!

