Thursday, October 15, 2009

ఆహా! ఏమా అందం !!!



తొలిచూపులోనే ఆహా! అబ్బబ్బబ్బబ్బా!!
ఏమని చెప్పను ఆ ఖజురహో శిల్పం గురించి,
ఏమా సౌందర్యం!!!

తివాచిలా విశాలంగా పరచివున్న నుదిటినా
చురకత్తుల్లాంటి నయనాలనా
ఘాటుగా వాలుజారిన ముక్కునా

తొలకరి జల్లులతో తడిసినట్లున్న అధరాలనా
ఆహా ఏమా ముఖ పరిచయం!
ఎంతటి కారుచీకటినైన చీల్చకుండా ఉంటుందా!!

మత్తెక్కించే ఆ అందం
ఆ హొయలు సోయగాలు
ఒంపు సొంపులు
ముట్టుకుంటే కరిగిపోయాలా సుకుమారమైన నడుము
నడుస్తూవుంటే నెమలి పించంలా నాట్యమాడుతున్న కేశ సౌందర్యం గురించా
దేహానికే వన్నె తెచ్చిన ఆమె వెనుక అందం!!!

ఆహా 
నఖశిఖ పర్యంతం ఓ కళాఖండంలా
యువకుల గుండెల్ని కొల్లగొడుతూ
ఓ అచ్చమైన తెలుగుపిల్లలా
అందమైన బాపు బొమ్మలా
నడిచివస్తున్న దేవకన్యలా ఉన్నది  కదా!!!
అజరామరం ఆ అందం!!!

Wednesday, October 14, 2009

నోబెల్ పై ఒబామా 'శాంతి'

నేనుసైతం నోబెల్ శాంతికి ఎంపికైనాను
నేను చేసిన శాంతి ఏమి
నేను చేసిన పాపమేమీ ||

ఎందుకీ నోబులు నాకు
నేను కనీసం ఓం శాంతి ఓం సినిమానైన చూడనైతిని
నాకు ఎందుకీ నోబులు శాంతి
నేను చేసిన పాపమేమి
నేను చేసిన  శాంతి ఏమి ||

నేనుసైతం గాంధీనై  శాంతి కోసం పోరాడనైతిని
నెహ్రూ నై కపోతమెగుర వేయనైతిని
నాకు ఎందుకీ శాంతి నోబులు
నేను చేసిన శాంతి ఏమి
నేను చేసిన పాపమేమీ ||


నేనుసైతం నోబులు శాంతికి  ఎంపికైనందుకు
ప్రజల మనసులో అశాంతి ఏల
నోబులు బహుమతి కే శాంతి లేకుండా
నేను చేసిన పాపమేమీ
నేను చేసిన శాంతి ఏమి||

ప్రకృతి కేళి !!!

రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో
రేయనక పగలనక
శ్రమియించి కూడబెట్టి
గతగడానికి కొన్ని గంజి నీళ్లు
కప్పుకోవడానికో కొంత బట్ట
తలదాచుకోవడానికో కొంత చోటు సంపాదించుకొని
భార్యాబిడ్డలతో ఇరుగుపొరుగు తో
సుఖసంతోషాలతో ఇలాగే సాగిపోవాలని
పిల్లలు ఎదిగి పెద్ద హోదాలో ఉండాలని
జీవితం లో ఇంతకన్నా ఏమి కావాలి మనిషికి
అని అనుకుంటున్న తరుణంలో
ప్రకృతే విలయతాండవం చేసి
డొక్కలో కొడితే
ఎటూ పాలు పోనీ శరీరం
మళ్ళీ కష్టించే శక్తి లేని దేహం
కొమరుల భవిష్యత్తు కృష్ణలో కలుస్తుంటే
గుండె చెదరి కల చెదరి
సాగారానికై తనువు పయనించక
సామాన్యుడనైన నాకు నీతో పోరాడే శక్తి ఎక్కడ?

రండి !!! వరద పీడిత ప్రజల్ని ఆదుకుందాం!!!

Thursday, August 6, 2009

మనసు దోచిన కన్నెపిల్ల!!!

దివి నుండి భువికి దిగి వచ్చిన దేవకన్యవో
తారాజువ్వలా తళుకులీనిన కన్నెపిల్లవో
నీ జాడ తెలియరాదేమి?
నా మనసు దోచిన కన్నెపిల్లవో
దోబూచులాటలేల నీకు?
నా మతి భ్రమింప చేసిన శిలవో
ఏ శిలల మధ్య దాగున్నావు?
కనిపించవా మళ్లీ ఇంకొకసారి ?
లేక తామరాకు పై నీటి బిందువేనా
నా ఆనందం??

Friday, February 20, 2009

మన్నించుమా ప్రియా!

నా జీవితానికి వెలుగునిస్తున్నావనే భ్రమలో
నువ్వు కరిగిపోతున్నావని గ్రహించలేక పోయానే ప్రియా!!! మన్నించుమా :(

అలకా? వెన్నెలా!!

వెన్నెలమ్మా! నీకెందుకు నాపై అలక?
ఆకోపానికి నా మది చెదిరిపోతోంది!!
కనుపాపపై వుండి కంటినిండా కలలనిచ్చే నీకు
కనుకులేకుండా చేయడం తగునా ప్రియా?
స్వేచ్చవిహారం చేసే నీ ప్రతిబింబం
మనసులో నిప్పులు చెరుగుతోంది
అల్లాడిపోతున్న నీ నన్ను
దహించకుండా నువ్వు శాంతపడవచ్చు కదా సుమీ!!!

రాజకీయం పై ఉక్కుపాదం!!!


వచ్చెన్ వచ్చెన్ మళ్లీ ఓట్ల పండగ వచ్చెన్?!?!
నాయకుల పబ్బం గడుపుకునే పండగ వచ్చెన్ బాంచెన్?!?!
ఊరూరా పార్టీ కచేరి చేయనేల ?!
తెలం'గానం' పాడనేల?!
ప్రగల్భాలు పలకనేల?!
సామాన్యుడి గొంతుకోయనేల?!
ఎన్ని'కల'ల ఉచ్చులో బలిచేయనేల?!
బెగ్గింగులు రిగ్గింగులు చేయనేల?!
చితికిన పేదల పొట్టలు కొట్టనేల?!!
అసెంబ్లీలో ఒకరిపైఒకరు విమర్శల వెల్లువేల?!
ప్రజల సమస్యల పరిష్కారమేల?!!
ఎవడబ్బ సొమ్మని స్వప్రయోజనాలకు ఉపయోగించుకోనేల?!
కాలేకడుపుకు పట్టెడన్నం దూరంచేయనేల?!!
కుళ్లుపట్టిన రాజకీయం ఏరివేతకు పూనుకుందాం!!
నేటి రాజకీయాలపై ఉక్కుపాదం మోపి కదంతొక్కుదాం!!!

Monday, February 16, 2009

కంచు ప్రేమ


కంచు మోగినట్లు కనకంబుమ్రోగునా ప్రియా!
నేను నిన్ను ప్రేమించినట్లు మరెవరైనా ప్రేమించగలరా ప్రియా!!

అమ్మో!



కారుచీకట్లు కమ్ముకున్నాయి
అంతలో ఓ వికృత ఆకారం
హాహాకారాలు చేస్తూ నా వెంటపడింది
భయముతో కాలికి బుద్ది చెప్పిన నేను
జనసందోహంలో కలిసి
కొద్దికాలం గడిపిన తర్వాత
తిరుగుప్రయాణం మొదలెట్టిననాకు
మళ్లీ ఆ ఆకారం ప్రత్యక్షమయ్యే సరికి
గజగజ వణుకుతూ
ప్రాణాలు గుప్పిట్లో పట్టుకుని
గమ్యస్థానం చేరుకునేసరికి
అప్పుడు నాకు మెలకువ వచ్చి
అర్థమయ్యింది అది ఓ పీడకల అని!!!

సంగమం



నిర్మలమైన మనసులోకి సునామీలా వచ్చిన ప్రేమ సౌందర్యమా,
ఆ తాకిడికి నా పంచేద్రియాలు దాసోహమై,
నీ రాకతో చలించిన నా హృదయం
ఆ క్షణం నా ఆధీనంలో లేక
ప్రేమతీరంలోకి నీతో సంగమానికై
పయనించినది కదా ప్రియతమా!

Sunday, February 15, 2009

ఒంటరితనం ---- ఒక జీవిత సత్యం


తాను ఒంటరిగా జనించిన మనిషి
అమ్మ స్పర్శతో తననీడను ఎంచుకుంటాడు!
తన ఎదుగుదలను కోరుకునే మనిషి
ఒంటరిగానే ముందుకెళ్తాడు !!

అమ్మానాన్న ప్రేమానురాగాలనొదలేసి చదువుసంధ్యలకోసం
ఏదో వెలగబెడదామని మళ్లీ ఒంటరితనాన్ని ఎంచుకోలేదా!
ప్రేమాదోమా అంటూ యవ్వనాన ఇంతుల చుట్టూ తిరుగుతూ
ప్రేమోన్మాదిగా మారితే చివరికి మిగిలేది ఒంటరితనమే కాదా!!

తన కాళ్ళపై తాను నిలబడతానని చేసిన ప్రతిన నిలుపుకోవటానికి
ఉద్యోగవేటకై ఒంటరిగా పరుగుతీయలేదా!
పరిణయమాడాక సతిపోరు తప్పించుకోవటానికి

మళ్లీ మొదటికే వచ్చి ఒంటరితనాన్ని కోరుకోలేదా!!

రామాకృష్ణా! అని గడపాల్సిన క్షణాన కొమరులతో గొడవ యిష్టంలేక
మనసు చంపుకుని మళ్లీ ఒంటరిగా మారడం నీకు చేత కాలేదా!

పుట్టినవాడు గిట్టకమానడు అన్నట్లు వెళ్తున్నామే తప్ప
చివరికి మనమేమి మూటగట్టుకు వెళ్తున్నాం? ఒక్క "ఒంటరితనం" తప్ప!!

కాబట్టి స్నేహితులారా! ప్రతి జంతువు పుడుతుంది! చస్తుంది! కాని
అన్ని తెలిసిన మనుషులమైన మనము ఈ జీవనగమనంలో నేను నాది
వదలేసి యిరుగుపొరుగుకు సాయపడుతూ దేశాభివృద్దికి తోడ్పడకూడదా!!
ఒక్క క్షణం ఆలోచిద్దాం!!!


అందమైన అద్దం!!!

నాలోని రూపురేఖలు...
....నీ మతి పోగొడుతున్నాయా!


నాలోని కనుబాసలు...
....నీకు అర్థమవకుండాపోతున్నాయా!


నాలోని ఉచ్వాస నిచ్వాసలు...
....నీ ఎద భారాన్ని తెలుపుతున్నాయా!


నాలోని అధరములు...
....నీకు నోరూరింప జేస్తున్నాయా!


నాలోని మేనిచాయ...
....నీ అందానికే వన్నె తీసుకోస్తున్నదా!


నాలోని ముంగురులు...
....నీ మోముపై గిలిగింతలు పెడుతున్నాయా!


......మరి ఎంతైనా నీ అందమైన అద్దాన్నికదా!!!!!!!

ఏంటీ...... నిజమే!

ఉవ్వెత్తున ఎగసిన కెరటం
అగ్గిపై కసి తీర్చుకుందామనుకుందా!!

బుసకొట్టిన సర్పం
జీవిపై కాటు వేద్దామనుకుందా!!

రెచ్చిపోయిన వాహనం
ప్రాణం తీద్దామనుకుందా!!

మోగిన ఘంట
చెవిటివాడిని చేద్దామనుకుందా!!

ఎర్రబడిన తమలపాకు
రక్తాన్ని ఏమరుపాటు చేద్దామనుకుందా!!

పగబట్టిన పుస్తకం
నిశానిని చేద్దామనుకుందా!!

కోప్పడిన కనులు
నిద్రాభంగం చేద్దామనుకున్నాయా!!

ఏంటీ ..... ఇదంతా నిజమే!!! :)

Friday, February 13, 2009

విరహ వేదన!!

అగ్నిపర్వతం బద్దలై లావా ప్రవహిస్తుంటే
అది ఓ ఉపద్రవమేమో అనుకున్నా!
ఆకాశం భోరున విలపిస్తుంటే
అదికుంభవృష్టేమో అనుకున్నా!
అడవులు అగ్నికి ఆహుతైపోతుంటే
అది ఓ ప్రకృతి విపత్తు అనుకున్నా!
గాలి హోరున శబ్ధభేరి చేస్తుంటే
అది సుడిగాలి అనుకున్నా!
పుడమి ముక్కచెక్కలవుతుంటే
అది ఓ భూకంపం అనుకున్నా!
నా విరహవేదనను తెలుసుకొని కాబోలు!!!

Monday, February 9, 2009

ప్రేమికుల రోజు


మనసు నవయవ్వనంతో ఉప్పొంగుతూ ...
తన కళల రాణి కోసం తెగ ఆరాట పడుతూ ...
ప్రియా! ఓ ప్రియా !! అంటూ అమ్మాయి వెంటబడుతూ ....
రాత్రనకా పగలనకా తనే సర్వస్వమనే ధ్యాసతో ...
ఎన్ని ఒడిదుడుకులొచ్చినా మనసొడ్డి పోరాడుతూ...
ప్రేమయే లక్ష్యసాధనగా ముందుకు దూసుకెళుతూ...
ఎట్టకేలకు యిష్టసఖి మనసుదోచుకొని తనదైన శైలితో
తన స్వప్నాన్ని సాకారం చేసుకుని విజయదరహాసంతో
ఆనందడోలికలలో తేలియాడుతూ
జరుపుకుంటున్న ఈ పండగయే ....... ప్రేమికుల రోజు !!!

Tuesday, February 3, 2009

రూపాయి గోడు


నేను రూపాయిని !!! నేను రూపాయిని !!!

నిన్నమొన్నటిదాకా ఎగిరెగిరిపడ్డ రూపాయిని నేను! --2
యిప్పుడే కాలువిరిగిందని తెలిసి దిగులుపడ్డ రూపాయినీ నేనే !!

పేదరికం దరిచేరని రూపాయిని నేను ! --2
ధనికుల అహంబావానికి నలిగిపోతున్న రూపాయినీ నేనే !!

అమాయకుల ఆకలిచావులకు కారకురాలౌతున్న రూపాయిని నేను! --2
ఉన్నవాడి చేతికి బలౌతున్న నష్టజాతక రూపాయినీ నేనే !!

పూటగడవక దిక్కుతోచక వున్నవారికి అందని ద్రాక్షనైన రూపాయిని నేను! --2
నీళ్ళలా ఖర్చుకాబడుతూ సతమతమౌతున్న రూపాయినీ నేనే!!

వినయవిదేయతలున్నవారి మొహంచూడని రూపాయిని నేను! --2
కామక్రోధమదమాత్సల్యాలతో
రగిలిపోతున్న వారి జేబునిండా వున్నరూపాయినీ నేనే !!

లేనివాడి అర్తనాదాలను పట్టించుకోని
ఉన్నవాడి ప్రగల్భాలకు లోనవుతూ
బిక్కమోహంవేసి బక్కచిక్కి
నేలరాలిపోతున్న ప్రాణమున్న నిర్జీవాన్ని!!

దేవుడా! నా ఈ గోడు పట్టించుకోవా!
నీ ఈ జగాన్ని రక్షించుకోవా!!