Monday, February 16, 2009

అమ్మో!



కారుచీకట్లు కమ్ముకున్నాయి
అంతలో ఓ వికృత ఆకారం
హాహాకారాలు చేస్తూ నా వెంటపడింది
భయముతో కాలికి బుద్ది చెప్పిన నేను
జనసందోహంలో కలిసి
కొద్దికాలం గడిపిన తర్వాత
తిరుగుప్రయాణం మొదలెట్టిననాకు
మళ్లీ ఆ ఆకారం ప్రత్యక్షమయ్యే సరికి
గజగజ వణుకుతూ
ప్రాణాలు గుప్పిట్లో పట్టుకుని
గమ్యస్థానం చేరుకునేసరికి
అప్పుడు నాకు మెలకువ వచ్చి
అర్థమయ్యింది అది ఓ పీడకల అని!!!

2 comments:

  1. పీడకలా? నేను ఇంకా ఎమో చెప్తారనుకున్నాను. భలే చెప్పారు. నిజమే అప్పుడప్పుడు ఇలాంటివి ప్రతి ఒక్కరికి వస్తుంటాయి కదూ!

    ReplyDelete