Sunday, February 15, 2009

ఒంటరితనం ---- ఒక జీవిత సత్యం


తాను ఒంటరిగా జనించిన మనిషి
అమ్మ స్పర్శతో తననీడను ఎంచుకుంటాడు!
తన ఎదుగుదలను కోరుకునే మనిషి
ఒంటరిగానే ముందుకెళ్తాడు !!

అమ్మానాన్న ప్రేమానురాగాలనొదలేసి చదువుసంధ్యలకోసం
ఏదో వెలగబెడదామని మళ్లీ ఒంటరితనాన్ని ఎంచుకోలేదా!
ప్రేమాదోమా అంటూ యవ్వనాన ఇంతుల చుట్టూ తిరుగుతూ
ప్రేమోన్మాదిగా మారితే చివరికి మిగిలేది ఒంటరితనమే కాదా!!

తన కాళ్ళపై తాను నిలబడతానని చేసిన ప్రతిన నిలుపుకోవటానికి
ఉద్యోగవేటకై ఒంటరిగా పరుగుతీయలేదా!
పరిణయమాడాక సతిపోరు తప్పించుకోవటానికి

మళ్లీ మొదటికే వచ్చి ఒంటరితనాన్ని కోరుకోలేదా!!

రామాకృష్ణా! అని గడపాల్సిన క్షణాన కొమరులతో గొడవ యిష్టంలేక
మనసు చంపుకుని మళ్లీ ఒంటరిగా మారడం నీకు చేత కాలేదా!

పుట్టినవాడు గిట్టకమానడు అన్నట్లు వెళ్తున్నామే తప్ప
చివరికి మనమేమి మూటగట్టుకు వెళ్తున్నాం? ఒక్క "ఒంటరితనం" తప్ప!!

కాబట్టి స్నేహితులారా! ప్రతి జంతువు పుడుతుంది! చస్తుంది! కాని
అన్ని తెలిసిన మనుషులమైన మనము ఈ జీవనగమనంలో నేను నాది
వదలేసి యిరుగుపొరుగుకు సాయపడుతూ దేశాభివృద్దికి తోడ్పడకూడదా!!
ఒక్క క్షణం ఆలోచిద్దాం!!!


2 comments:

  1. chinuku chinuku okatai tudaku varada avadaaa :) modalu pettinadi okkarame ayina andariki upayoga padaali :)

    ReplyDelete