Friday, April 8, 2011

కదలుదాం... రండి!!

అక్రమార్కుల ఆట కట్టే విక్రమార్కుడు ఒక్కడేరా!
ప్రజాక్షేమం మంటకలిపి స్వార్జితానికి బానిసైన
వారి దుమ్ము దులపడానికి రెడీఅయి వచ్చాడురా!!

ఒక్క పోచే కదా అనుకుంటే తప్పురా!
నీ ఆస్తుల చిట్టా పెగిలించే గునపమవుద్ది రా!!

ఎన్ని వత్సరాలు బతికేది నీకే తెలీదు రా!
అలాంటిది బతికినన్నాళ్లు నలుగురికి సాయపడటం నేర్చుకోరా!!



రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్న పేదవాడిని చూడరా!
తేరగా దోచుకోవడానికి నీ బండరాతి హృదయానికెలా దరిస్తుందిరా!!

ప్రజాధినేత అంటే ప్రజల కష్టాన్ని సొమ్ము చేసుకోవడం కాదురా!
ప్రజోపకారం చెయ్యడమని నీకు తెలీదురా?!

సొమ్ముసొమ్మని దోచుకున్న కుతంత్రుల అవినీతికి చెక్ పెట్టె బిల్లు వస్తుంది రా!
అందరి జీవితాలకి వెలుగుని తెస్తుంది రా!!

1 comment:

  1. avineetipai nuvu ekkupettina ee kavitaa bhanam..
    cheelchali aa pandikokkula gundelani..

    ReplyDelete